ex minister rajendra bahuguna self firing with gun in uttarakhand
mictv telugu

మనవరాలిపై లైంగిక ఆరోపణలు.. మాజీ మంత్రి ఆత్మహత్య

May 27, 2022

ex minister rajendra bahuguna self firing with gun in uttarakhand

కొడుకు కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కోడలు ఆరోపణలు చేయడంతో ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులకు సమాచారమిచ్చి వాటర్ ట్యాంక్ ఎక్కి దేశవాళీ తుపాకీతో తనను తాను కాల్చుకుని మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర బహుగుణ 2004లో ఎన్డీ తివారీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అయితే ఆయన కోడలు కొడుకుతో విభేదాల కారణంగా బహుగుణ నివసిస్తున్న భవనంలోనే ఓ ఫ్లోర్‌లో తన కుమార్తెతో నివసిస్తోంది. మూడ్రోజుల కింద బహుగుణ కోడలు మామ రాజేంద్ర బహుగుణపై సంచలన ఆరోపణలు చేసింది. తన కూతురిపై బహుగుణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసుల బహుగుణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తనపై కోడలు తీవ్ర ఆరోపణలు, బయట మనవరాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ప్రచారం కావడం తట్టుకోలేని బహుగుణ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీ నెంబరుకి ఫోన్ చేసి భగత్ సింగ్ కాలనీలోని వాటర్ ట్యాంకు ఎక్కారు. అప్పటికే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు ఎంత బ్రతిమిలాడినా రాజేంద్ర కిందకు దిగి రాలేదు. అందరూ చూస్తుండగా తుపాకీ తీసి కాల్చుకున్నారు. అనంతరం పోలీసులు ఆసుపత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు రాజేంద్ర అప్పటికే మరణించారని నిర్ధారించారు.