మాజీ మంత్రి దామోదర్ రెడ్డి  కారుకు ప్రమాదం.. స్వల్పగాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి  కారుకు ప్రమాదం.. స్వల్పగాయాలు

July 1, 2020

 

hfjyvhjgh

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా సుజాత నగర్‌  మండలం డేగల మడుగు వద్ద ఇది చోటు చేసుకుంది. వెంటనే మరో వాహనంలో తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.

దామోదర్‌రెడ్డికి లింగాలకు వెళ్తుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మరో కారు ఢీకొట్టింది. వెంటనే అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీన్ని గమనించిన స్థానికులు ప్రథమచికిత్స అందించారు. ఆ తర్వాత మరో కారులో వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.