పేదల కడుపు నింపుతున్న కవితక్క - MicTv.in - Telugu News
mictv telugu

పేదల కడుపు నింపుతున్న కవితక్క

April 2, 2020

Ex mp kalvakuntla kavitha donate Food for daily laboures

లాక్‌డౌన్‌తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక చేతిలో డబ్బులు లేక తినడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దినసరి కూలీలు, తక్కువ వేతనం గల ఉద్యోగులను ఆదుకునేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందుకువచ్చారు. ఆరు కేంద్రాల్లో అన్నదానం నిర్వహిస్తూ ఎందరో అన్నార్తుల కడుపు నింపుతున్నారు. వేలాది మంది పేదలు, వలస కూలీల కడుపు నింపుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సహా, గ్రంథాలయం వద్ద, జగిత్యాల, మెట్‌పల్లి‌, బోధన్, ఆర్మూర్‌లలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద జాగృతి నాయకులు ఈ అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. 

ఈ అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతిరోజు 2000 వేల మందికి పైగా భోజనం అందిస్తున్నారు. అన్నదాన కేంద్రాల దగ్గర సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. అందుబాటులో మాస్కులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి సంబంధీకులు, వైద్య సిబ్బందికి అన్నదాన కేంద్రాల ద్వారా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా, గత రెండేళ్లుగా కవిత లక్షల మంది అన్నార్థుల కడుపు నింపుతున్న విషయం తెలిసిందే.