సంతోష్ రావు,కేటీఆర్‌కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత - MicTv.in - Telugu News
mictv telugu

సంతోష్ రావు,కేటీఆర్‌కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత

August 3, 2020

EX MP Kavitha Tied Rakhi to Santosh Rao

రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ  కట్టి సంబరంగా వేడుక చేసుకుంటున్నారు. అటు సీఎం కేసీఆర్ నివాసంలోనూ రాఖీ వేడుక జరిగింది. మాజీ ఎంపీ కవిత సోదరులు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్ రావు‌లకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

ప్రగతిభవన్‌‌కు చేరుకున్న ఆమె సోదరులకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఆ తర్వాత  మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సునీత, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, సహా పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. కాగా కరోనా నేపథ్యంలో గతేడాది కంటే ఈసారి కాస్త తక్కువగానే సందడి కనిపిస్తోంది.