కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణం

August 8, 2020

EX MP Nandi Yellaiah Pass Away With Corona

కరోనాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య (78) కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల 29న కరోనా పాజిటివ్ రావడంతో ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడం చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ సంఘటన కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన కుటుంబంలో విషాదం నింపింది. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

నంది ఎల్లయ్య ఆరు సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూల్ నుంచి ఒకసారి, సిద్ధిపేట నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు నాగర్ కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. 1979 – 84 వరకు, 1989 – 97 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.