ఉల్లి వ్యాపారిగా మారిన మాజీ ఎంపీ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి వ్యాపారిగా మారిన మాజీ ఎంపీ..!

December 4, 2019

01000

ఉల్లి పేరు వింటేనే సామాన్యుడు భయపడిపోతున్నాడు. కిలో రూ. 100కు చేరడంతో  ఇప్పుడది అందని దాక్షగా మారిపోయింది. ఈ ధరలను అదుపు చేయడం ప్రభుత్వాల వల్ల కూడా కావడం లేదు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు అమ్ముతున్నా ఎవరికీ సరిపోవడం లేదు. బిహార్‌లో అయితే ఉల్లి ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే అక్కడి విపక్ష పార్టీలు ప్రభుత్వం తీరును ఎండగడుతూ వినూత్నంగా నిరసనలు చేపడుతున్నాయి. ఈ ధరలకు తాళలేక ఓ మాజీ ఎంపీ ఏకంగా ఉల్లి వ్యాపారిగా మారిపోయి తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారు. 

జన అధికార్ పార్టీ (జెఎపి) కన్వీనర్, మాజీ ఎంపీ పప్పు యాదవ్ పాట్నా వీధుల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర  కార్యాలయం ఎదుట కిలో ఉల్లి రూ. 35కు అమ్ముతూ నిరసన తెలిపారు. డిసెంబర్ నాటికి ఉల్లి ధరలు అదుపు చేస్తామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ చెప్పారని, కానీ ఆ దిశగా ఏ మాత్రం అడుగులు పడటం లేదని మండిపడ్డారు. వెంటనే స్పందించి ధరలు అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉల్లి పేరు చెబితేనే కళ్ల నుంచి నీరు వచ్చే పరిస్థితి ఏర్పడిందని పప్పూ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.