కార్గిల్ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేవీ యోధుడు కన్నుమూశారు. నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ (79) బుధవారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దాయాది దేశంతో జరిగినన యుద్ధంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
1998 నుంచి 2001 వరకు నేవీ చీఫ్‌గా సుశీల్ కుమార్ పనిచేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌తో ఆయనకు మరిచిపోలేని అనుబంధం ఉంది. అందుకే సుశీల్ కుమార్ అప్పట్లో ఓ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని రచించారు. 1965, 1971లో జరిగిన ఇండోపాక్ యుద్ధంలోనూ ఆయన పాల్గొన్నారు.