అబ్దుల్ కలాంకు నా విజనే స్ఫూర్తి..చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

అబ్దుల్ కలాంకు నా విజనే స్ఫూర్తి..చంద్రబాబు

November 10, 2019

‘హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా ఆయన అనేక సార్లు ‘నేనే’ కామెంట్స్ చేసారు. చంద్రబాబు చేసే నేనే కామెంట్స్ అనేకసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

vision 2020 document నేనే తయారు చేశా… నా దగ్గరకి కలాం వచ్చి నా సలహాలు తీసుకుని ఆయన పుస్తకం రాశారు …. చంద్రబాబు నిజం…. కలామ్ గారి Vision 2020 Book 1998 లో release చేశారు. https://en.wikipedia.org/wiki/India_20201998 లో అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకానికి 1999 లో మీ గుడ్డి vision 2020 ఆధారం అనడానికి సిగ్గు అనిపించలేదా చంద్రబాబు గారు ? 2004 లో మీరు ఓడిపోవడానికి ఈ గుడ్డి vision 2020 కారణం అని అప్పటి పత్రికలు రాయలేదా ? చంద్రబాబు గారి 2020 vision 1999 లో release అయ్యింది. https://www.scribd.com/doc/33166412/Andhra-Pradesh-Vision-2020-full-documentఈయన ఈయన పోసుకోలు మాటలు…. ఈయన మాటలు నమ్మి తమ్ముళ్ళు బుర్ర ఉపయోగించ కుండా ఏది పడితే అది వాగుతా ఉంటారు…

Posted by Sridhar Reddy Avuthu on Friday, 8 November 2019

ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. కలాంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించిన విజన్ 2020 గురించి తెలుసుకున్న కలాం గారు నా విజన్ 2020 నుంచి స్ఫూర్తి పొంది ఆ తర్వాత విజన్‌పై పలు పుస్తకాలను రచించి.. ఏకంగా దేశ ఆర్ధిక విజన్‌పై ఓ బుక్ సైతం ఆవిష్కరించారని చెప్పుకొచ్చారు. ఇక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.