ఇటీవల టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన దివ్యవాణి ఆ పార్టీ లొసుగుల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. సొంత పార్టీలో పనిచేస్తున్న ఒక మహిళను అగౌరవ పరచడానికి టీడీపీ వాళ్లు ఎంత నీఛానికైనా పాల్పడతారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. పార్టీకి రిజైన్ చేసినట్లు.. ప్రెస్ మీట్ పెట్టిన తరువాత.. టీడీపీ వాళ్లు దారుణమైన పోస్ట్లు పెట్టారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది. ‘నువ్ బాత్ రూంలో స్నానం చేస్తూ.. అయ్యన్నపాత్రుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో మా దగ్గర ఉంది.. అది రిలీజ్ చేస్తాం అని బుచ్చయ్య చౌదరి అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టారని తెలిపింది.
బుచ్చయ్య చౌదరి గారు నాకు ఫోన్ చేసి.. అమ్మా ఇలా పోస్ట్ పెట్టారు అది ఫేక్ అని అన్నారు. అప్పుడు నేను అన్నాను.. అంకుల్ మీరు దానికి యాక్షన్ తీసుకోరా? అని అడిగాను. మీరు తీసుకోకపోతే పార్టీ అయినా యాక్షన్ తీసుకోవాలి కదా…. ఏమీ లేకుండా మాట్లాడతారా? మాకు కుటుంబాలు లేవా? మాకు పిల్లలు లేరా? వాళ్లకి పెళ్లిళ్లు కావా?.. గుండెల్ని కొట్టుకుని పార్టీ కోసం పనిచేశా. అలాంటి నాకే అన్యాయం చేశారు’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. చంద్రబాబు, లోకేష్ గారి వల్ల పార్టీ నుంచి ఎవరూ బయటరారు. వాళ్లు చాలా మంచి వాళ్లు.. చుట్టూ ఉన్న దరిద్రుల వల్లే పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఈవిషయంలో లోకేష్ సమీక్షించుకోవాలని దివ్యవాణి తెలిపింది.