తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్..! - MicTv.in - Telugu News
mictv telugu

తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్..!

March 17, 2019

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌ను తొలి లోక్‌పాల్‌గా నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వచ్చే వారం చర్చలు జరిపిన అనంతరం ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిలతో కూడిన సెలక్షన్ కమిటీ పినాకి చంద్రఘోష్ పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు. సెలక్షన్ శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

Ex-Top Court Judge Justice PC Ghose Set To Be First Lokpal Sources.

లోక్‌పాల్‌, జాతీయ అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్‌ కమిటీలోని 8మంది సభ్యులు ఇతర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు దీనిపై అధికారిక వాదనలు విన్న తర్వాతే అధికారిక ప్రకటన చేయనున్నారు. జస్టిస్ ఘోష్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నాలుగేళ్లు పనిచేశారు. 2017లో ఆయన పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు.