బొగ్గు స్కాం.. మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ల జైలు - MicTv.in - Telugu News
mictv telugu

బొగ్గు స్కాం.. మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ల జైలు

October 26, 2020

Scam

బొగ్గు స్కాం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు ఢిల్లీ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దిలీప్ రే దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. 

1999లో జార్ఖండులో బొగ్గు బ్లాకుల కేటాయింపులో దిలీప్ రే అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు దర్యాప్తులో తేలింది. జార్ఖండు రాష్ట్రంలోని గిరిదిహ్‌లోని బ్రహ్మ దిహ బొగ్గు బ్లాకులను దిలీప్ రే కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించారు. దిలీప్ రేతో పాటు మాజీ అధికారులైన నిత్యానంద్ గౌతం, ప్రదీప్ కుమార్ బెనర్జీలకు కూడా కోర్టు శిక్ష విధించింది.