అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటూ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ వ్యంగ్యంగా స్పందించారు. ఇటీవల ఇమ్రాన్ మాట్లాడుతూ.. తనకు జీవితంలో పేరు, డబ్బు అన్నీ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దీన్ని ఉటంకిస్తూ ‘ అవును. ఆయనకు అన్నీ ఉన్నాయి. ఒక్క తెలివి తేటలు తప్ప’ అంటూ దెప్పి పొడిచింది. ఇంకో సందర్భంలో.. నా చిన్నప్పుడు పాక్ చాలా ఉన్నతంగా ఉండేది అంటూ ఇమ్రాన్ చేసిన కామెంటుపై కూడా రెహమ్ స్పందించారు. మీరు ప్రధానిగా లేని సమయంలోనే పాకిస్తాన్ మంచి స్థితిలో ఉండేదంటూ బదులిచ్చింది. కాగా, రెహమ్ ఖాన్ ఇమ్రాన్‌కు రెండో భార్య. 2014 లో వివాహం చేసుకొని ఏడాదికే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇమ్రాన్ పదవి నుంచి దిగిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Jis admi k paas sub kuch hei but aqal nhi
— Reham Khan (@RehamKhan1) March 31, 2022