ముఖేష్, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం రాజస్థాన్లోని నాథ్ద్వారాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి బాలీవుడ్ అగ్రతారలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ ఈవెంట్ కంటే ముందు ముంబైలో ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ జరిగింది. ముకేశ్ అంబానీ భవంతి ‘అంటిల్లా’లో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకి అతికొద్ది మంది ముఖ్య అతిధుల మాత్రమే హాజరయ్యారు. ముకేశ్ అంబానీ నిర్మించిన ‘అంటిల్లా’ ముంబై నగరానికే కాదు.. దేశంలోనే అత్యంత విలాసవంతమైన భవంతి అంటారు. ముంబైలోని ఆకాశహార్మ్యాలను తలదన్నే `అంటిల్లా` నగరానికే తలమానికం. ఈ భవంతిలోని పై అంతస్తుల్లో రెండు అంతస్తులు పూర్తిగా కార్ల పార్కింగ్ కే కేటాయించారు. అంటిల్లాలో ఎలాంటి పార్టీ జరిగిన అంబానీకి అత్యంత సన్నిహితులకే ఇంటిపై పార్కింగ్ కి అనుమతి లభిస్తుంది.
ప్రతి ఒక్క బాలీవుడ్ సెలబ్రెటీ అంబానీ కంట పడాలని.. ఆహ్వానం అందగానే ఆమడ దూరంలో కారు పార్క్ చేసి నడుచుకుంటూ భవంతికి లోకి వెళ్తారు. అయితే అనంత్ అంబానీ ప్రీ ఎంగేజ్మెంట్ కి వచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మాత్రం తన కారుని సరాసరి లోనికి తీసుకెళ్లాడని అంటున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ నుండి కేవలం అమితాబ్ బచ్చన్ వాహనాన్ని మాత్రమే అంటిల్లా లోనికి అనుమతించేవారని.. తొలిసారి షారుఖ్ కార్ కి పర్మిషన్ వచ్చిందని బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. అయితే షారుఖ్ తరువాత వచ్చిన సల్మాన్ ఖాన్ కారుని బయటే ఆపేశారని.. కారు దిగి సల్మాన్ సోలోగా నడుచుకుంటూ లోపలికి వెళ్లాడని.. కానీ షారూక్ మాత్రం కార్ ని లోనికి పోనిచ్చాడని అంటిల్లా దెగ్గరుండే స్పాట్ బోయ్స్ వెల్లడిస్తున్నారు. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కి అంబానీలు ఇచ్చిన ఈ ప్రత్యేక ట్రీట్ మెంట్ పై అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. షారుఖ్ ప్రొఫెషన్ లోనే కాదు యాటిట్యూడ్ లోను కింగ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.