తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో ఓ మహిళ ఆలయానికి వెళ్లి శవమై కనిపించిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళను ఎవరు హత్య చేశారని, ముమ్మరంగా వెతుకున్న పోలీసులకు ఆ నిందితుడెవరో తెలిసిపోయేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్గిరి విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలో రైల్వే ఉద్యోగి జీవీఎన్ మూర్తి, భార్య ఉమాదేవి(56) నివాసముంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 27న కుమార్తె వివాహం చేశారు. ఈనెల 8న కుమారుడికి నిశ్చితార్థం నిర్వహించారు. అయితే, ఉమాదేవికి రోజూ శివపురిలోని మల్లికార్జునస్వామి ఆలయానికి కాలినడక వెళ్లి రావడం అలవాటు.
ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 18) సాయంత్రం ఆలయానికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గుడి వద్దకు వెళ్లి చూశారు. అక్కడ ఆమె చెప్పులు మాత్రమే కన్పించాయి. దాంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవంతో మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆలయ వద్దనున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఆలయానికి వెళ్లిన సమయంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు, గొలుసు, ఉంగరాలు, చెవి దిద్దులు శరీరంపై లేకపోవడంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కోణంలో ఆలయం సమీపంలోని సీసీటీవీ పుటేజీ పరిశీలించారు. అందులో పూజారి మురళినే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఉమాదేవి నగలను, బంగారు గాజులను ఆలయ పూజారే కొట్టేసి, ఆమెను హత్య చేసి స్వయంభూ సిద్ది వినాయకస్వామి ఆలయం వెనుక పడేశాడినట్లు పోలీసులు గుర్తించారు.