Exciting Munugode bypoll counting..BJP with a lead of more than a 1000 votes
mictv telugu

ఉత్కంఠ రేపుతున్న బైపోల్ కౌంటింగ్.. రెండో రౌండ్‌లో లీడ్‌లో బీజేపీ

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు అధిక్యం రాగా.. రెండో రౌండ్‌లో బీజేపీకి 1000 ఓట్లకు పైగా ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చిన టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. కౌంటింగ్ ను పరిశీలించారు. మునుగోడులో ప్రజలు గెలవబోతున్నారని, తీర్పు టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉంటుందని చెప్పి వెళ్లిపోయారు.

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పరిశీలించారు.. హైదరాబాద్ ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ తో పర్యవేక్షణ చేశారు.. కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ జరుగుతున్న తీరును ఆబ్జర్వ్ చేశారు.