Exempt All Persons With Less Than Rs.8 L Annual Income From Income Tax
mictv telugu

ఇదేలా సాధ్యం.. ఈడబ్ల్యూఎస్‌పై న్యాయ పోరాటం..

November 22, 2022

103వ రాజ్యాంగ సవరణ యొక్క చెల్లుబాటును సమర్థిస్తూ .. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లపై కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ. 7,99,999 లోపు ఉన్న కుటుంబాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద ప్రయోజనాలను పొందాలనేది కేంద్రం ఉద్దేశం. అయితే రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాలని కేంద్రం పేర్కొన్న ఆదేశాలపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూ. 7,99,999 లోపు ఉన్న కుటుంబాలను ఈడబ్ల్యూఎస్ గా పరిగణించిన కేంద్రం 2.50లక్షల ఆదాయం ఉన్నవారిని పన్ను కట్టాలంటూ ఆదేశాలు ఎలా జారీ చేస్తుందని ఓ వ్యక్తి పిటిషన దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

ఆదాయపు పన్ను రేటును నిర్ణయించే ఫైనాన్స్ యాక్ట్, 2022లోని మొదటి షెడ్యూల్ ని తీసివేయాలని పిటిషనర్, DMK పార్టీ సభ్యుడు కున్నూరు సీనివాసన్ కోర్టును ఆశ్రయించారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. 2,50,000 వార్షిక ఆదాయం గల కుటుంబాలు పన్ను చెల్లింపు నుండి మినహాయించాలనేది పిటిషనర్ ప్రధాన వాదన. “రూ.7,99,999/- లోపు ఆదాయం ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన కుటుంబంగా.. EWS రిజర్వేషన్ కింద పరగణించిన కేంద్రం.. వారి నుండి ఆదాయపు పన్ను వసూలు చేయడానికి అనుమతించకూడదని కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్.మహదేవన్, జస్టిస్ జె.సత్యనారాయణ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం న్యాయ, న్యాయ, ఆర్థిక, సిబ్బంది మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. కేసును 4 వారాలకు వాయిదా వేసింది.