exercises to strengthen your heart, exercises
mictv telugu

ఇవి చేస్తే హార్ట్ ఎటాక్ లు రమ్మన్నా రావు

January 5, 2023

exercises to strengthen your heart

ఎక్కువ వర్కౌట్స్, విపరీతమైన డైట్స్ చేసి హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న సెలబ్రిటీలను ఈమధ్య చూస్తున్నాం.అదే కాకుండా సడెన్ హార్ట్ ఎటాక్ లతో చనిపోతున్నవారి సంఖ్యా ఈ మధ్య ఎక్కువ అవుతోంది. దీనికి కారణం సరైన జీవన విధానం లేకపోవడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం. మానవ శరీరానికి హార్ట్ సెంటర్ పాయింట్. అన్నీ దానితోనే లింక్ అయి ఉంటాయి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీని కోసం చాలా మంది డైట్ ఫాలో అవుతుంటారు. కానీ దానితో పాటూ ఎక్సర్సైజ్ లూ అవసరమే. హార్ట్ ఆరోగ్యంగా ఉండడానికి కార్డియో చేయాలి. అసలేంటీ కార్డియో ఓ చూద్దాం.

కార్డియో వల్ల లాభాలు:

కార్డియో వంటి వ్యాయామాలను ఎప్పుడైతే చేస్తారో అప్పుడు హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. దాంతో బ్లడ్ పంపింగ్ అనేది త్వరగా జరుగుతుంది. ఈ విధంగా శరీర భాగాలు అన్నిటికీ ఆక్సిజన్ చేరుతుంది. కేవలం గుండె ఆరోగ్యం మాత్రమే కాకుండా లంగ్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్, కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్ మొదలగు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఏ విధమైన కార్డియో చేసిన ప్రయోజనం ఉంటుంది అని గుర్తుంచుకోండి.

ఒకవేళ మీ గుండె ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కార్డియో వంటి వ్యాయామాలు చేయలేము అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం లో ఇంటెన్సిటీ మరియు లో ఇంపాక్ట్ ఉండేటువంటి వ్యాయామాలు ద్వారా కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతాయి.

కార్డియో అనగానే చాలా మంది వాకింగ్ లేదా సైకిలింగ్ అనుకుంటారు. కానీ వాటితో పాటూ ఇంకా చాలా ఎక్సర్సైజ్ లు ఉన్నాయి.

స్ట్రెంత్ ట్రైనింగ్:

స్ట్రెంత్ ట్రైనింగ్ కొంచెం తక్కువ ఇంటెన్సిటీతో ఉంటుంది.సరైన ఇంటెన్సిటీతో స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే గుండె పనితీరు బాగుపడుతుంది. ఎందుకంటే దీనివల్ల వల్ల హార్ట్ రేట్ ఎలివేట్ అవుతుంది. దాంతో పూర్తిగా ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం వల్ల మజిల్ మాస్ పెరగడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి.

యోగా:

యోగా వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పూర్తి ఏకాగ్రతతో చేయాలి. అంటే వీటికి బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, బ్రీత్ వంటివి ఎంతో అవసరం. యోగాను క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్, రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. దాంతో పాటుగా హార్ట్ రేట్ కూడా కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది.

వాకింగ్:

వాకింగ్ అనేది ఎంతో సులువైన, అందరికీ తెలిసిన వ్యాయామం. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా కూడా ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. అంతేకాకుండా మీకు నచ్చిన ఇంటెన్సిటీతో ఈ వ్యాయామం చేయొచ్చు. వాకింగ్ ను కూడా మరింత ఎఫెక్టివ్ గా మార్చుకోవడానికి చేతిలో కొంచెం బరువైన వస్తువులను తీసుకుని నడవాలి. ఈ విధంగా కొన్ని రోజులు వాకింగ్ చేసిన తర్వాత కాస్త దూరాన్ని పెంచడం లేక మధ్యలో జాగింగ్ చేయడం వంటివి కూడా చేయవచ్చు.

ఆటలు:

ఏదైనా ఆటలను ఆడడం కూడా హార్ట్ కి మంచిదే. ఆటల వల్ల మానసిక ఆనందం కూడా కలుగుతుంది. దాంతో పాటు వ్యాయామం చేసినట్టు అవుతుంది. అన్ని క్రీడలు ఇంటెన్సిటీతో కూడినవే కాబట్టి మంచి వర్కౌట్ అవుతుంది. కాబట్టి హార్ట్ రేట్ కూడా మెరుగ్గా ఉంటుంది.

కార్డియో లేక ఇతర వ్యాయామాలను చేయడానికి సమయం లేకపోయినప్పుడు కేవలం రోజంతా యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేయాలి. కొద్ది దూరం నడవడం లేక మన పనులను, ఇంటి పనులను మనమే చేసుకోవడం వంటివి చేయాల. కింద కూర్చుని లేవడం కూడా ఒక ఎక్సర్సైజే. ఇలా చేయడం వల్ కూడాల గుండె పనితీరు చురుగ్గా ఉంటుంది.