ఎగ్జిట్ పోల్స్.. మళ్ళీ ఎన్డీయేదే అధికారం - MicTv.in - Telugu News
mictv telugu

ఎగ్జిట్ పోల్స్.. మళ్ళీ ఎన్డీయేదే అధికారం

May 19, 2019

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. తుది విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. 542 లోక్‌సభ స్థానాలతో పాటు, నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎవరెవరు గెలుస్తారనేది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా కడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. అలాగే కేంద్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు కీలక ప్రాంతీయ పార్టీల విజయావకాశాలు ఎలా ఉంటాయనేది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. వీటి ద్వారా తుది ఫలితాలపై అంచనాకు వచ్చే అవకాశముండటంతో ప్రజలంతా ఆసక్తిగా ఎక్సిట్స్ పోల్స్‌ని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు వెలుబడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల దృష్ట్యా మళ్ళీ ఎన్డీయే కూటమే అధికారంలోకి రానుందని తెలుస్తుంది.

ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

* టైమ్స్‌ నౌ-విఎంఆర్:  బీజేపీ+306: కాంగ్రెస్‌+132: ఇతరులు:104

* న్యూస్‌ నేషన్‌:   బీజేపీ+282/290: కాంగ్రెస్‌+118/126: ఇతరులు:130/138

* రిపబ్లిక్‌ టీవీ‌:  బీజేపీ+287: కాంగ్రెస్‌+128: ఇతరులు:127

* రిపబ్లిక్‌ టీవీ -జన్‌ కీ బాత్‌:  బీజేపీ+305: కాంగ్రెస్‌+124: ఇతరులు:113

* సువర్ణ న్యూస్: బీజేపీ+295: కాంగ్రెస్+122: ఇతరులు:102

* ఎన్డీటీవీ: బీజేపీ+298: కాంగ్రెస్+128: ఇతరులు:116

* న్యూస్ ఎక్స్-నేత: బీజేపీ+242: కాంగ్రెస్+162: ఇతరులు:136

* రిపబ్లిక్- సీఓటర్ : బీజేపీ+287: కాంగ్రెస్+128: ఇతరులు:117