ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణాలో టీఆర్ఎస్ హవా - MicTv.in - Telugu News
mictv telugu

ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణాలో టీఆర్ఎస్ హవా

May 19, 2019

Exit Poll Results 2019 India LIVE updates Lok Sabha election predictions likely to sway market trends, SEBI ramps up security.

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. తుది విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. 542 లోక్‌సభ స్థానాలతో పాటు, నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎవరెవరు గెలుస్తారనేది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా కడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. అలాగే కేంద్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు కీలక ప్రాంతీయ పార్టీల విజయావకాశాలు ఎలా ఉంటాయనేది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. వీటి ద్వారా తుది ఫలితాలపై అంచనాకు వచ్చే అవకాశముండటంతో ప్రజలంతా ఆసక్తిగా ఎక్సిట్స్ పోల్స్‌ని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు వెలుబడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల దృష్ట్యా తెలంగాణాలో టీఆర్ఎస్ హవాకొనసాగుతుందని తెలుస్తుంది.

 

ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

 

* ఆర్జి ఫ్లాష్ టీం: టీఆర్ఎస్-14/16, కాంగ్రెస్-0/2, ఇతరులు-1

* న్యూస్ 18 ఇండియా: టీఆర్ఎస్-12/14, కాంగ్రెస్-01/02, ఇతరులు-01

* సీ ఓటర్ : టీఆర్ఎస్-14, కాంగ్రెస్-02, ఇతరులు-01