మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. గత ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి - MicTv.in - Telugu News
mictv telugu

మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. గత ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి

May 19, 2019

Exit Poll Results Lok Sabha Elections 2019 LIVE Who'll be Crowned on May 23 Countdown Begins.

మరి కాసేపట్లో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాల కన్న నాలుగు రోజుల ముందే వివిధ న్యూస్ ఛానెళ్లు, మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. కేంద్రంలో ఎవరికి అధికారం దక్కుతుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలవబోతున్నారు అన్న అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో గత ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయో చూద్దాం.

* 2004 లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వాజ్‌పేయి అధ్యక్షతన బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాని సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది.

* 2009లో యూపీఏ, ఎన్డీయే రెండు కూటములకూ సమాన సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ చెబితే… యూపీయేకి అంచనాకి మించి ఎక్కువ సీట్లు లభించాయి. ఎన్డీయేకి సీట్లు తగ్గాయి.

* ఇక 2014లో ఎన్డీయే కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కానీ కేవలం బీజేపీ పార్టీనే 282 సీట్లతో పూర్తి మెజార్టీ దక్కించుకుంది.