మునుగోడులో ఎగ్జిట్ పోల్ సర్వే.. మూడింట్లోనూ ఆ పార్టీదే హవా - MicTv.in - Telugu News
mictv telugu

మునుగోడులో ఎగ్జిట్ పోల్ సర్వే.. మూడింట్లోనూ ఆ పార్టీదే హవా

November 3, 2022

సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ టైం ముగిసింది. క్యూలో ఉన్న ఓటర్లకు మరింత సమయం పొడిగించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికపై పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ నిర్వహించి వాటి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని సాధారణ ప్రజలతో పాటు మునుగోడు ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్ వివరాలను ఆసక్తిగా వింటున్నారు. ముందుగా థర్డ్ విజ్ రీసెర్చ్ – నాగన్న, ఎస్ఏఎస్ గ్రూప్, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థలు తమ నివేదికలను వెల్లడించాయి. వాటి ప్రకారం ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకుందాం.

1. థర్డ్ విజన్ – నాగన్న సర్వే : టీర్ఎస్ 48 నుంచి 51 శాతం, బీజేపీ 31 నుంచి 35 శాతం, కాంగ్రెస్ 13 నుంచి 15 శాతం, బీఎస్పీ 5 నుంచి 7 శాతం, ఇతరులు 2 నుంచి 5 శాతం వరకు వస్తాయని అంచనా వేశారు.
2. ఎస్ఏఎస్ గ్రూప్ : టీర్ఎస్ 41 నుంచి 42 శాతం, బీజేపీ 35 నుంచి 36 శాతం, కాంగ్రెస్ 16.5 నుంచి 17.5 శాతం, బీఎస్పీ 4 నుంచి 5 శాతం, ఇతరులు 1.5 నుంచి 2 శాతం వరకు వస్తాయని అంచనా వేశారు.
3. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ : టీర్ఎస్ 42.11, బీజేపీ 35.17, కాంగ్రెస్ 14.07, బీఎస్పీ 2.95, ఇతరులు 5.70 శాతం వరకు వస్తాయని అంచనా వేశారు.