ఎగ్జిట్ పోల్స్.. వైసీపీకి పట్టం కట్టిన ఏపీ ఓటర్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఎగ్జిట్ పోల్స్.. వైసీపీకి పట్టం కట్టిన ఏపీ ఓటర్లు

May 19, 2019

Exit Polls Results Release.. Ysrcp Lead In andhra pradesh Assembly And Lok Sabha Seats  

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఆదివారం జరిగిన తుది విడత ఎన్నికల పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో గత నెలలోనే ఎన్నికలు ముగిసినప్పటికీ.. కొన్నిచోట్ల నేడు రీపోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు  జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఫలితాలపై ఉత్కంఠతో ఉన్న ప్రజలు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత వారిలో ఏ పార్టీ గెలువనుంది. ఏ పార్టీ అధికారం చేపట్టనుంది అని ఓ అంచనా రానుంది.

 

ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఫలితాలు..

ఇండియా సర్వే ప్రకారం.. ఏపీ లోక్‌సభ స్థానాలు..

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ : 18 నుంచి 20 స్థానాలు

తెలుగుదేశం పార్టీ :  04 నుంచి 06 స్థానాలు

ఇతరులు  : 1 స్థానం

 

సీపీఎస్ సర్వే ప్రకారం.. ఏపీ అసెంబ్లీ స్థానాలు…

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ : 130 నుంచి 133 స్థానాలు

తెలుగుదేశం పార్టీ : 43 నుంచి 44 స్థానాలు

జనసేన పార్టీ : 0 నుంచి 1 స్థానం

బీజేపీ : 0

కాంగ్రెస్ : 0

ఇతరులు : 0

 

వీడీపీ సర్వే ప్రకారం.. ఏపీ అసెంబ్లీ స్థానాలు..

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ : 111 నుంచి 121 స్థానాలు

తెలుగుదేశం పార్టీ : 54 నుంచి 60 స్థానాలు

జనసేన పార్టీ : 0 నుంచి 4 స్థానాలు

కాంగ్రెస్ : 0

ఇతరులు : 0

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ప్రజలంతా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉండటంతో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎగ్జిట్ పోల్స్‌ని పరిశీలిస్తున్నారు.