వికారాబాద్‌‌లో భూత వైద్యుడి ఆరాచకం.. యువతికి చుక్కలు - MicTv.in - Telugu News
mictv telugu

వికారాబాద్‌‌లో భూత వైద్యుడి ఆరాచకం.. యువతికి చుక్కలు

May 19, 2022

తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన అశ్విని (17) ఇంటర్‌ చదువుతోంది. ఇటీవలే ఆమె అనారోగ్యానికి గురైంది. దాంతో పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన అశ్విని సమీప బంధువు..’మా గ్రామంలో ఓ భూత వైద్యుడు (బాబా) ఉన్నాడు. ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడు. అశ్వినిని అక్కడకి తీసుకెళ్లండి’ అని తల్లిదండ్రులకు చెప్పాడు. అతని మాటలు విని అశ్విని తల్లిదండ్రులు బాబా దగ్గరకు తీసుకెళ్లారు. బాలికకు దెయ్యం పట్టిందని, భూత వైద్యం చేస్తానంటూ ఆ బాబా.. బాలికను నిప్పులపై నడిపించి చుక్కలు చూపించాడు.

దాంతో ఆ బాలిక చిత్రహింసలు పడింది. పాదాలు కాలిపోయి తీవ్రంగా గాయపడింది. మంటలు తట్టుకోలేక అల్లాడిపోయింది. నిప్పుల మీద నడవడంతో కాళ్లు బాగా కాలిపోయి, నడవలేని పరిస్థితికి చేరుకుంది. దాంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..”ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్ముతారా. వైద్యం పేరుతో దొంగ బాబా లేనిపోని, రోగాల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. ఇకపై ఇలాంటి వైద్యాన్ని నమ్మకండి” అని తెలియజేశారు. అనంతరం న‌కిలీ బాబా ర‌ఫీని బుధ‌వారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.