పేలిన బుల్లెట్ బైక్ ట్యాంక్..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

పేలిన బుల్లెట్ బైక్ ట్యాంక్..వీడియో వైరల్

April 4, 2022

17

ఆంధ్రప్రదేశ్‌లో ఓ ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి, బైక్ ట్యాంక్ రెండు పర్యాయాలుగా పేలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అదృష్టం ఏమిటంటే.. ఆ ఘటన సమయంలో అక్కడున్న భక్తులు అప్రమత్తమై, ప్రమాదం నుంచి తప్పించుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా బుల్లెట్ బైక్‌లో భారీగా మంటలు చెలరేగాయి. బైక్ అంత మంటలు అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది.

 

దీంతో అక్కడున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. మైసూరుకు చెందిన రవిచంద్ర స్వామిని దర్శించుకునేందుకు బైక్‌పై వచ్చారు. ఆలయం సమీపంలో బైక్‌ను పార్క్ చేశారు. అయితే, టైర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పూర్తిగా కాలిపోయిన బుల్లెట్ బైక్ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలింది. విస్ఫోటనం చెందే రీతిలో భారీగా మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, భక్తులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేయడంతో పక్కనున్న బైకులకు మంటలు వ్యాపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

మరోపక్క రోడ్డుపై వెళ్తున్న జనాలు ఆ శబ్ధానికి భయపడి, అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. మరికొంతమంది సహసం చేసి, పక్కనున్న బైక్‌లకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పివేశారు. దీంతో వీడియోను వీక్షిస్తున్న వారంతా థాంక్యూ దేవుడా భక్తులకు గాని, ప్రజలకు గాని ఏలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని తప్పించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.