మల్లన్న సాగర్‌లో పేలుడు.. యువకుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మల్లన్న సాగర్‌లో పేలుడు.. యువకుడు మృతి

May 17, 2019

Explosion in Mallanna Sagar.. Killed Young man.

మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పేలుళ్ల ధాటికి రాళ్ళు ఎగిరిపడి ఇళ్లమీద పడ్డాయి. దీంతో ఇంట్లో వున్న ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ ఘటన సిద్దిపేట మండలం తోర్నాల శివారులో మల్లన్న కాల్వల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రాళ్లను పేల్చడానికి పేలుడు పదార్థాలను వాడారు. దీంతో పేలుడు సంభవించి, రాళ్లు పెద్ద ఎత్తున్న ఊళ్ల మీద పడ్డాయి. ఈ క్రమంలో ఇంట్లో వున్న సురేష్(21) అనే యువకుడి మీద రాళ్లు పడ్డాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతని ముఖం మీదకు రాయి బలంగా దూసుకురావడంతో అతని ముఖం పూర్తిగా గుర్తుపట్టరాని విధంగా తయారైంది. ఈ ఘటన గురించి తెలిసి సురేష్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సురేష్ స్వస్థలం నిజాంపేట మండలం చల్మెడ గ్రామం.