తిరుమల పోటులో పేలుడు.. గురికి తీవ్రగాయాలు  - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల పోటులో పేలుడు.. గురికి తీవ్రగాయాలు 

October 24, 2020

Explosion in ttd vakulamatha potu.. Five seriously injured.jp

తిరుమల శ్రీవారి ఆలయం పోటులో పేలుడు సంభవించింది. దీంతో ఆలయంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పేలిన బాయిలర్ బ్లాస్ట్ అవడంతో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రసాదాలు తయారు చేసే వకుళా మాత పోటులో ఈ ప్రమాదం జరిగింది. ప్రసాదంగా పెట్టే పులిహోర కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా బాయిలర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

అప్రమత్తమైన అధికారులు వెంటనే గాయపడ్డవారిని తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలోకి మరింత మంది భక్తులను అనుమతించే విషయమై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.