ఒకే ఒక్క రిపోర్ట్..అదాని సామ్రాజ్యాన్ని కూల్చేసింది. వ్యాపారాల్లో మొన్నటి వరకు వెనక్కు తిరగు చూసుకోకుండా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న అదాని స్పీడ్‌కు అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బ్రేకులు వేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక విడుదల చేసింది.దీంతో ఒక్కసారిగా ఆదానీ షేర్లన్నీ పతనమయ్యాయి. అతడి ఆస్తులు మంచు కంటా వేగంగా కరిగిపోతున్నాయి. ప్రపంచ కుబేరుల 3 వ స్థానం నుంచి ఏకంగా 17 స్థానానికి పడిపోయాడు. ఇంక మరింత కిందకు జారిపోయే అవకాశాలున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ సగానికిపైగా పతనమైంది. ప్రస్తుతానికి దాదాపు 120 బిలియన్ డాలర్ల దిగజారింది.
అదానీని నమ్మిన ఇన్వెష్టర్లు నిండా మునుగుతున్నారు. ఇప్పటికే భారీగా నష్టపోయారు. ఇంకెంత నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాని మార్కెట్ వాల్యూ పడిపోతున్న విషయం అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎస్‌బీఐ (SBI), బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కస్టమర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పతనం ఫలితంగా తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఎస్‌బీఐ డిపాజిటర్లు, ఎల్ఐసీ పాలసీదారుల్లో భయపడుతున్నారు. అయితే వారికి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
అదాని వ్యవహారంపై మొదటి స్పందించిన కేంద్ర సర్కార్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. అదానీ గ్రూపు స్టాకుల పతన ప్రభావం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీల మీద తక్కువే అని తేల్చింది. ఈ రెండు సంస్థల్లోని ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథ్ వెల్లడించారు. రిస్క్ పరిమితికి లోబడే ఈ రెండు సంస్థలు అదానీ కంపెనీల్లో పెట్టుబడిపెట్టినట్లు తెలిపారు. జాతీయ బ్యాంకులు లేదా కంపెనీలకు చెందిన డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరసం లేదని సోమనానాథన్ స్పష్టం చేశారు.