ప్రియుడితో ఏకాంతం క‌ల్పించి మరీ చంపిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుడితో ఏకాంతం క‌ల్పించి మరీ చంపిన భర్త

May 5, 2022

హైద‌రాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న జంటహత్యల వెనుక కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు పోలీసులు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న త‌న భార్య జ్యోతిని, ఆమె ప్రియుడు య‌శ్వంత్ ను ప‌క్కా స్కెచ్ వేసి అంత‌మొందించాడు నిందితుడు శ్రీనివాస్. వారి మ‌ధ్య ఉన్న సంబంధం గుర్తించి.. ఇదివ‌ర‌కే పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోకపోవడంతో… హ‌త్య‌కు ప్లాన్ ర‌చించాడు. అందులో భాగంగానే గ‌త శుక్రవారం రోజే త‌న ఇద్దరు పిల్లలను స్వ‌గ్రామం విజయవాడకు పంపాడు. ఆ త‌ర్వాత‌ ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్తున్న‌ట్లు చెప్పి రెండ్రోజుల పాటు వారిద్దరికీ ఏకాంతంగా కలిసేందుకు అవకాశం కల్పించాడు.

శ్రీనివాస్ ప్లాన్ తెలియ‌ని ఆ ఇద్ద‌రు.. ఏకాంతంగా క‌లిశారు. ఆ స‌మ‌యంలోనే జ్యోతి, యశ్వంత్‌ను ఇంట్లోనే చంపేందుకు 3 సార్లు రెక్కీ నిర్వ‌హించాడు. వీలుకాక‌పోవ‌డంతో మనం ఊరు విడిచి వెళ్లిపోతున్నామని భార్య జ్యోతిని నమ్మించాడు. దీంతో చివ‌రిసారిగా ప్రియుడితో క‌ల‌వాల‌నుకున్న జ్యోతి.. ఆదివారం సాయంత్రం అత‌డికి ఫోన్ చేసి, బ‌య‌ట‌కు వెళ్లాల‌ని పిలిచింది. ఆ రోజు అబ్దుల్లాపూర్‌లో రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో జ్యోతి, య‌శ్వంత్‌లు ఏకాంతంగా ఉన్న సమయంలో.. ఇద్దర్నీ మట్టుబెట్టాడు. ముందుగా బండరాయితో జ్యోతి తలపై మోది చంపి, ఆ వెంటనే యశ్వంత్‌ తలపైనా మోది , ఆ తర్వాత వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో అతని ఛాతీ, మర్మాంగాలపై పలుమార్లు పొడిచాడు. ఇద్ద‌రూ చ‌నిపోయార‌ని నిర్ధారించుకున్నాక అక్క‌డి నుంచి విజయవాడ పారిపోయాడు. ఇద్దర్నీ ఇంట్లో చంపడం కుదరకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లో హత్య చేసిన‌ట్లు తెలిసింది.