నా మొగుడు కరోనాతో పోయాడో.. ‘పతివ్రత’ దొంగ ఏడుపు  - MicTv.in - Telugu News
mictv telugu

నా మొగుడు కరోనాతో పోయాడో.. ‘పతివ్రత’ దొంగ ఏడుపు 

May 8, 2020

Extra marital affair take husband life

‘వోలమ్మో, ఓర్నాయనో. నా మొగుడు బంగారం, వెండి, ఇత్తడి రాగి.. ఈ పాడు కరోనా పొట్టన పెట్టుకుందిరో నాయనో.. నేనెట్టా బతిరేదిరా దేవుడోయ్..’ అని ఆమె కంటికి మింటికి ఏకధాటిగా ఏడ్చింది. కరోనా టైమ్ కాబట్టి బంధువులకు అదేమంత విచిత్రంగా కనిపించలేదు. కాకపోతే దుక్కలా ఉన్న ఆ మనిషి కనీసం చికిత్స అయినా తీసుకోలేదేమిటబ్బా అనే అనుమానం పొరుగువారికి ఓ మూల తొలిచింది. అది కాస్తా గుట్టురట్టు చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను వదిలించుకోడానికి ఆ మహా ఇల్లాలు కరోనా నాటకం ఆడినట్లే తేలింది. 

ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. శరత్‌దాస్‌(46),  అనిత(30) అశోక్‌విహార్‌లో ఉంటున్నారు. ఈ నెల 2న ఉదయం శరత్ నిద్రలేవలేదు. భర్త చనిపోయాడని అనిత శోకాలు పెడుతూ ఇరుగూ పొరుగువాళ్లకు చెప్పింది. బంధువులకు ఫోన్లు కూడా చేసింది. అంత్యక్రియలకు త్వరగా ఏర్పాట్లు సాగాయి. కానీ ఎంతైనా కరోనా టైం కనుక పొరుగువారికి చిన్న అనుమానం వచ్చింది. పక్క ఇంట్లో ఉండిన మనిషి కరోనాతో పోయాంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మొత్తానికి పోలీసులకు ఫిర్యాదు అందింది. ‘కరోనాతో చనిపోయాడని అంటున్నావు కదా. అతని టెస్ట్ పేపర్లు చూపమ్మా..’ అని పోలీసులు అడిగారు. అనిత చేసేదేమీ లేక నేరం అంగీకరించింది. సంజయ్ అనే ప్రియుడి కోసం మొగుణ్ని మట్టుబెట్టానని ఒప్పుకుంది. దీనిపై గొడవలు పడేవాళ్లమని, అదను చూసుకుని ఆ రోజు రాత్రి తలపై దిండు అదిమిపెట్టి హతమార్చానని వివరించింది.