అక్రమ సంబంధాలు ఈ రంగాల్లో ఎక్కువ.. కొత్త సర్వే - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ సంబంధాలు ఈ రంగాల్లో ఎక్కువ.. కొత్త సర్వే

February 14, 2020

Extra-marital.

సర్వేలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అవినీతి ఏఏ రంగాల్లో ఉందో చెప్పే సర్వేల మాదిరే అక్రమ సంబంధాలపైనా ఓ సర్వేను అఘోరించారు. ఆష్లే మాడిసన్ అనే ఆన్ లైన్ డేటింగ్ వెబ్‌సైట్ ఈ లెక్కలు తీసింది. కేవలం పెళ్లయిన వారిని మాత్రమే సర్వే చేశారు. వెయ్యిమంది లైంగిక జీవితంపై ప్రశ్నలు అడిగి జవాబులను విశ్లేషించారు. సర్వే ఫలితాలను బట్టి.. 13 రంగాల్లో అక్రమ, అనైతిక సంబంధాలను ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. వాటికి కూడా ర్యాంకులు ఇచ్చేశారు. బిజినెస్, కన్‌స్ట్రక్షన్, ఐటీ, మెడికల్ రంగాల్లో దారి తప్పేవాళ్లు ఎక్కువగా ఉన్నారట. అందరూ ఊహించిన దానికి భిన్నంగా సినిమాలు, కళలకు సంబంధించిన ఆర్ట్స్ కేటగిరిలో అవి కాస్త తక్కువేనట. 

అక్రమ సంబంధాలో ఆయా రంగాల ర్యాంకులు

 1. వ్యాపారాలు, నిర్మాణరంగాలు
 2. వైద్యరంగం 
 3. ఐటీ సెక్టార్
 4. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
 5. ఫైనాన్స్, ఎడ్యుకేషన్
 6.  రిటైల్, ఆతిథ్యం
 7. సామాజిక సేవ (సోషల్ వర్క్)
 8. మార్కెటింగ్, కమ్యూనికేషన్లు
 9. వినోదం
 10. ఆర్ట్స్
 11. న్యాయసేవలు (లీగల్ సెక్టార్)
 12. వ్యవసాయం
 13. రాజకీయాలు