శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత.. కన్నడిగుల వీరంగం - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత.. కన్నడిగుల వీరంగం

March 31, 2022

hjk

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో బుధవారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ వీధుల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. అంతకు ముందు ఓ టీ దుకాణం వద్ద స్థానికులకు, కన్నడ భక్తులకు మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది క్రమంగా ఘర్షణగా మారి దుకాణాలకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. కన్నడ యువకులు టీ దుకాణానికి నిప్పు పెట్టడంతో, స్థానికులు గొడ్డలితో కన్నడ యువకుడిపై దాడి చేశారు. బాధితుడికి తీవ్ర గాయాలవడంతో 108 అంబులెన్సులో సున్నిపెంటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన కన్నడిగులు తాత్కాలిక దుకాణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేశారు. దీంతో భయపడ్డ స్థానికులు ఇంట్లోంచి బయటకు రాలేదు. సమాచారం అందుకున్న డీఎస్పీ శృతి శ్రీశైలం చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఉగాది పండుగకు ముందు ఇలాంటి ఘటన జరగడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.