చత్వారానికి చుక్కల మందు.. మార్కెట్లోకి వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

చత్వారానికి చుక్కల మందు.. మార్కెట్లోకి వచ్చేసింది

May 24, 2022

నలభై ఏళ్లు పైబడిన వారిలో చాలా మందికి సహజంగా వేధించే సమస్య ఛత్వారం (ప్రెస్బయోపియా). ఇది వచ్చిన వాళ్లు కళ్లు మసకగా ఉండి స్పష్టంగా చూడలేరు. న్యూస్ పేపర్ చదవాలన్నా, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ మీద ఉన్న అక్షరాలను చదవలేరు. చదవాలంటే మాత్రం కళ్లజోడు తప్పనిసరి. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం వచ్చేసింది. వ్యూటీ (VUITY) అనే చుక్కల మందు రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ మెడిసిన్‌ని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే స్పష్టంగా కనపడడం జరుగుతుంది. ఈ మేరకు అమెరికా ఔషధ, ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. దీంతో ఛత్వారాన్ని సరిచేసే తొలిమందుగా వ్యూటీ రికార్డులకెక్కింది. కాగా, మన కన్ను పనిచేసే తీరును బట్టి ఈ మందు పని చేస్తుంది. కానీ, మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇది గనక మన వరకు వస్తే చాలా మందికి కళ్లజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.