మళ్లీ జగన్ సీఎం కాకపోతే.. ఆస్తులన్నీ రాసిస్తా: ధర్మాన కృష్ణదాస్ - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ జగన్ సీఎం కాకపోతే.. ఆస్తులన్నీ రాసిస్తా: ధర్మాన కృష్ణదాస్

March 19, 2022

kiju

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ”వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ జగన్ సీఎం అవుతారు. ఈ విషయంలో నేను టీడీపీ నేతలకు సవాల్ విసిరుతున్న. జగన్ మళ్లీ సీఎం కాకపోతే నా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తా. రాష్ట్రానికి జగన్ లాంటి నేత నభూతో నభవిష్యత్” అని ఆయన అన్నారు. అంతేకాకుండా జగర్ ప్రతి గడపకు వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రకారమే తాను ప్రతి ఇంటికి వస్తానని అన్నారు.

మరోపక్క 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు కూడా విజయం సాధించడంతో.. ధర్మాన కృష్ణదాస్‌కు జగన్ మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంత సంచలనంగా మారాయి.