F2 సినిమాకు జాతీయ స్థాయి అవార్డు..  - MicTv.in - Telugu News
mictv telugu

F2 సినిమాకు జాతీయ స్థాయి అవార్డు.. 

October 21, 2020

F2 Movie Wins National Award

టాలీవుడ్‌లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కథతో 2019లో వచ్చిన ఎఫ్-2  సినిమా ఊహించని హిట్ అందుకుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ కలెక్షన్లను గట్టిగానే రాబట్టింది. కామెడి కంటెంట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. జాతీయ స్థాయిలో ఓ అవార్డును సొంతం చేసుకుంది. 

ఇండియన్ పనోరమా కేటగిరీ ఫర్ 2019లో భాగంగా ఈ అవార్డు లభించింది.  ఫీచర్ ఫిలిం కేటగిరీలో వివిధ భాషల్లోని సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. దీంట్లో ఎఫ్2 సినిమాకు కూడా అవార్డు దక్కింది. కాగా, ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్‌ రాజ్, సుబ్బరాజు  కీలక పాత్ర పోషించారు. మరోసారి ఎఫ్3 పేరుతో సినిమా కూడా తీసేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైన సంగతి తెలిసిందే. అవార్డు రావడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయింది.