బైక్ నంబర్ ప్లేట్‌కు ఫేస్ మాస్క్.. ఏమి తెలివిరా బాబు - MicTv.in - Telugu News
mictv telugu

బైక్ నంబర్ ప్లేట్‌కు ఫేస్ మాస్క్.. ఏమి తెలివిరా బాబు

September 24, 2020

bick

కరోనా నుంచి తప్పించుకోవడానికి ముక్కూ, మూతి కవర్ చేసేలా మాస్కులను వాడటం సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని విధిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎంత మంది ఆచరిస్తున్నారో లేదో కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ నంబర్ ప్లేటుకు కూడా మాస్క్ తగిలించాడు. అది ఏదో జాగ్రత్త కోసం అనుకుంటే పొరపడినట్టే. ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఈ విధంగా చేశాడు. హైదరాబాద్ పోలీసులు దీన్ని ఫొటో చేసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. 

ట్రాఫిక్ చలానా పడకుండా హోండా బైక్‌కు నంబర్ పూర్తిగా కనిపించకుండా దానికి తగిలించాడు. ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు దీన్ని ఫొటో తీసి షేర్ చేశారు. ‘మాస్క్ ఉండాల్సింది మీ ముఖానికి మీ బైక్‌కు కాదు’ అంటూ సెటైర్‌ వేశారు. నిబంధనలు పాటిస్తే మీకు, మీ తోటి వారికే క్షేమం అని హితవు చెప్పారు. ఇలా చేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలాంటి చావు తెలివి తేటలకు పాల్పడిన వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.