విమానంలో మాస్క్ పెట్టుకోలేదని దారుణంగా..  - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో మాస్క్ పెట్టుకోలేదని దారుణంగా.. 

August 3, 2020

Face mask plane journey 

కరోనా వైరస్ బారినుంచి కాపాడుకోడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆయుధాల్లో మాస్కస్ ముఖ్యమైంది. కేసులు లక్షలు దాటి కోటికి చేరుతున్నా చాలామంది ఇప్పటికీ మాస్కుల విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలనూ ముప్పులో పడేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా భౌతిక దాడులకు, హత్యలకు కూడా దారి తీస్తోంది. విమానంలో ఓ ప్రయాణికుడు మాస్క్ పెట్టుకోలేదని తోటి ప్రయాణికులు అతణ్ని దారుణంగా చితగ్గొట్టారు. 

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డమ్ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘోరం జరిగింది. ఓ యువకుడు నిబంధనల ప్రకారం ఫేస్ మాస్క్ పెట్టుకోకపోవడం గమనించిన ప్రయాణికులు అతన్ని మందలించారు. కనీసం బట్ట అయినా అడ్డం పెట్టుకోమని కోరారు. అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు. మాటామాటా పెరిగింది. అందరూ కలసి అతనిపై దాడి చేశారు. అతనికి వత్తాసు పలికిన యువకుణ్ని చితగ్గొట్టారు.  విమాన సిబ్బంది జోక్యం చేసుకుని వారిద్దర్నీ కాపాడారు. ఈ వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొట్టడం తప్పు అని కొందరు, మంచిపనే చేశారని కొందరు అంటున్నారు.