ఫేస్‌బుక్ సీవోవో ప్రేమ పెళ్లి.. భర్త చనిపోయాక ఐదేళ్లకు - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ సీవోవో ప్రేమ పెళ్లి.. భర్త చనిపోయాక ఐదేళ్లకు

February 4, 2020

hg

ఫేస్‌బుక్ సీఓఓగా పని చేస్తున్న  షెరిల్ శాండ్‌బర్గ్(49) మరోసారి వివాహం చేసుకోబోతున్నారు. తన ప్రియుడు టామ్ బెర్న్‌తల్‌ను(46) త్వరలోనే పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. ఇటీవల వీరిద్దరికి జరిగిన నిశ్చితార్థం ఫొటోలను కూడా షేర్ చేశారు.  ఇకపై నువ్వే నా సర్వస్వం.. బహుశా ఇంతకంటే ఎక్కువగా.. గొప్పగా నా ప్రేమను ఎవరిపై వ్యక్తపరచలేనేమో’ అంట పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. 

 షెరిల్ శాండ్‌బర్గ్ భర్త 2015లో ఓ ఫ్యామిలి ఫంక్షన్‌లో ఉన్నట్టుండి మరణించాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ఇటీవల ఆమె లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన టామ్‌తో ప్రేమలో పడింది. ఇతడు కెల్టన్ గ్లోబల్ అనే సంస్థకు సీఈవోగా పనిచేస్తున్నారు. అయితే టామ్ బెర్న్‌తల్‌ కూడా పెళ్లై విడాకులు తీసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పరస్పర అంగీకారంతో వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ప్రేమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.