ఢిల్లీలో సూసైడ్ అటెంప్ట్.. అడ్డున్న ఫేస్‌బుక్ అలర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో సూసైడ్ అటెంప్ట్.. అడ్డున్న ఫేస్‌బుక్ అలర్ట్

August 10, 2020

Facebook Flags Man's Activity.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అనగానే అందరికీ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, ఫ్రెండ్స్ తో చాట్ చేయడం గుర్తుకు వస్తాయి. కానీ, ఫేస్ బుక్ ఎందరో ప్రాణాలు కాపాడుతోంది. ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌ భారత్ కు చెందిందిగా గుర్తించి ‘సూసైడల్‌ యాక్టివిటీ’గా రెడ్‌ ఫ్లాగ్‌ సూచించింది. దీన్నీ ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్‌ ఉద్యోగి గుర్తించి ఆ అకౌంటు వివరాలను ఢిల్లీ పోలీసులకు ఈమెయిల్‌ చేయాడు. దీంతో ఢిల్లీ సైబర్‌ క్రైం డీసీపీ అన్యేష్‌ రాయ్‌ రంగంలోకి ఆ అకౌంట్ తో సంబంధం ఉన్న ఫోన్‌ నెంబర్ ఢిల్లీకి చెందిన ఓ మహిళ పేరుపై‌ రిజిస్టర్‌ అయి ఉందని కనుక్కున్నారు. వెంటనే ఓ టీంను ఆ ఫోన్ నంబర్ అడ్రస్ కు పంపించారు. అక్కడికి వెళ్లి చూడగా ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవడం లేదు. దీంతో ఆ నంబర్ తో ఉన్న ఫేస్ బుక్ ఖాతాను ఎవరు వినియోగిస్తున్నారని ఆరా తీశారు. 

దీంతో ఆ ఫేస్‌బుక్‌ అకౌంటు తన భర్తదని, రెండు వారాల క్రితమే తనతో గొడవపడి ముంబయికి వెళ్లిపోయినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ముంబయిలో ఓ హోటల్‌లో తన భర్త పనిచేస్తుంటాడని తెలిపింది. అక్కడ అతని అడ్రస్‌ తనకు తెలియదని కేవలం ఫోన్‌ నెంబరు మాత్రమే ఉందని పోలీసులకు ఇచ్చింది. ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు ముంబయి పోలీసులకు ఇచ్చారు. ముంబయి పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తి నెంబర్‌కు ఫోన్‌ చేయగా అది అందుబాటులో లేనట్లు తేలింది. ఆ వ్యక్తి వాట్సాప్‌ నెంబరుకు వీడియో కాల్‌ చేయాలని యువకుడి తల్లిని కోరారు. ఆమె ఫోన్‌ చేయగా ఒక్క రింగ్‌ అయి ఆగిపోయింది. కొద్ది సమయం తరువాత ఆ యువకుడు మరో నెంబరు నుంచి తన తల్లికి ఫోన్‌ చేశాడు. పోలీసులు అతనికి నచ్చజెప్పేందుకు గంటపాటు మాటలను కొనసాగించారు. ఈ సమయంలో ముంబై పోలీసులు అతడి లొకేషన్‌ను కనుగొన్నారు. ముంబై పోలీసులు దాదాపు అర్ధరాత్రి అక్కడకు చేరుకొని అతడిని కాపాడారు. ఈ విషయాన్ని ముంబయి సైబర్‌ క్రైం డీసీపీ రష్మీ కరాందికర్‌ మీడియాకు తెలిపారు.