ముందు ముందు ఇంకేం చేస్తారో ఈయన గారు.... - MicTv.in - Telugu News
mictv telugu

ముందు ముందు ఇంకేం చేస్తారో ఈయన గారు….

July 26, 2017

తెలుగు రాష్ట్రాల్లో ఈ లీడర్ రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఏం మాట్లాడినా పెను సంచలనమే అవుతుంది. ఈ మధ్య అయితే ఆయన గారు సిన్మవాళ్లను  మించిన  క్రేజ్ ను  సోషల్ మీడియాల సంపాదించుకున్నారు. ఏం చేసినా, చేయక  పోయినా మీడియాలో మాత్రం ఉంటారు. అట్లా ఇట్లా కాదు వారం రోజుల పాటు  స్టోరీలన్నీ ఆయన చుట్టే తిరిగేలా… సోషల్ మీడియాలో వీడియోలు  వైరల్ అయి తిరిగి మళ్లీ తన వరకు వచ్చే వరకు ఏదో ఒకటి  చేస్తూనే ఉంటారు. ఇంత పెద్ద  ఇంట్రడక్షన్ ఎవరి గురించి అనుకుకుంటున్నారా… మొన్నా మధ్య సమెంట్ పలకల మధ్య…. ఆ గుర్తుకొచ్చింది కదా… ఆ నారాయణ సారు గురించే.

అప్పట్ల గాంధీ జయంతి రోజున చికెన్ తిని సంచలనం క్రియేట్ చేశారు. యేడాది పాటు దాని జోలికి వెళ్లలేదు. ఆ తర్వాత నాయకుల నాల్కలు కోస్తానని, చెయిలు కోస్తానని ఎన్నో డైలాగులు  పేల్చారు.  ప్రభుత్వాలపై కామెంట్లు చేయడానికి సోషల్ మీడియాలో  వీడియోలను పోస్టు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇంట్లో కూర్చునే వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఈ మధ్య అయితే గీటార్ వాయిస్తూ పిల్లలతో ఆడుకుంటున్న ఫోటో  పోస్టు చేశారు. దానికి మాంచి రెస్పాన్స్ వచ్చింది.  చిరంజీవి సిన్మా షూటింగ్ వెళ్లి..ఆయన తో ఫోటో దిగి.. దాన్ని ఆఫ్ ఫేస్ లో పెట్టి ఈయన ఎవరో చెప్పండని అభిమానులకు క్వశ్చన్  వేశారు. ఇట్లా ఈయన కమ్యూనిస్టు నాయకుని కంటే…. సోషల్ మీడియల రియల్ హీరో అంటే బావుంటుందని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారట.