జియోను కొనే పనిలో ఫేస్‌బుక్! - MicTv.in - Telugu News
mictv telugu

జియోను కొనే పనిలో ఫేస్‌బుక్!

March 25, 2020

Facebook

దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియోలో షేర్లు కొనడానికి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. తద్వారా దేశంలో డిజిటల్ ఆపరేషన్స్‌లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్‌బుక్  యోచిస్తోంది. 

ఈ నెలాఖరులో ఫేస్‌బుక్‌, జియోల మధ్య ఈ మేరకు ఒప్పందం జరగాల్సి ఉంది. ఫేస్‌బుక్.. జియోలో 10 శాతం వాటా కోసం ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా వుందని, అయితే కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచ ప్రయాణ నిషేధాల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయాయని తెలుస్తోంది. మార్చి 2021 నాటికి రిలయన్స్ సంస్థ అప్పులేని సంస్థగా మార్చే ప్రణాళికల్లో ఈ అమ్మకం జరుగుతుందని తెలుస్తుంది. 2016లో దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్ జియో.. వేగంగా అభివృద్ధి చెందింది. మొబైల్ టెలికాంతోపాటు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు కూడా విస్తరించింది.