ఫేస్‌బుక్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసు..

March 28, 2018

యూజర్ల డేటాను లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా అవసరమైతే విచారణ కోసం తమ దేశానికి పిలిపిస్తామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కు కేంద్ర నోటీసులు జారీ చేసింది. డేటా లీకేజీపై ఏప్రిల్ 7లోగా ఈ విషయంపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

భారతీయ యూజర్ల డేటాను ఎన్నికలను ప్రభావితం చేయడానికి వాడుకుంటున్నారన్న అనుమాతనంతో నోటీసులు పాంపారు. తమ ఎన్నికల ప్రక్రియను అనుచితంగా ప్రభావితం చేస్తే, చూస్తూ ఊరుకోబోమని, కఠినంగా శిక్షిస్తామని రవిశంకర్ హెచ్చరించారు.