ఫేస్‌బుక్‌కు ఏమైంది? ఎందుకు మొరాయిస్తోంది? - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌కు ఏమైంది? ఎందుకు మొరాయిస్తోంది?

March 14, 2019

ఒకప్పుడు ఏం జరిగినా మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. కానీ కాలం మారింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఉంటే చాలు ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి వచ్చాకా.. ఎక్కడా ఏం జరిగిన వెంటనే దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సమాచారం మొత్తం వీటి ద్వారా మనకు అందుతోంది. అలాంటి వాటికి ఆటకం కలిగితే.. పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా? నిన్న రాత్రి 9 గంటల నుంచి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్‌లు సర్వర్ డౌనై సరిగా పనిచేయడం లేదు. దీంతో యువత చాలా ఇబ్బందులు పడుతోంది.

నిన్న రాత్రి నుంచి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సక్రమంగా ఓపెన్‌ అవకుండా యూజర్లను ఇబ్బంది పెడుతోంది. పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం జరగక పోవడంతో ఏమైదోనని యూజర్లు ఆందోళన చెందారు. ఫొన్లో కొంత వరకు పనిచేస్తున్నా.. డెస్క్ టాప్ వెర్షన్‌లో మాత్రం అసలు లాగిన్ కాకపోవడంతో పాటు ఓపెన్ అయినా.. మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించకపోవడంతో యూజర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఫేస్‌బుక్‌లో ‘సారీ, సమ్ థింగ్ వెంట్ రాంగ్’ అని మెసేజ్ మాత్రమే దర్శనిమిచ్చింది. యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లలోనూ ఇదే తరహా ఇబ్బందులు ఎదురయ్యాయి.  నిన్న రాత్రి 9గంటల నుంచి ఇప్పటికీ ఈ సమస్య ఇలాగే ఉంది.

దీంతో అందరూ ‘డీడీఓఎస్’ అటాక్ జరిగి ఉంటుందని, అందుకే ఈ సమస్య తలెత్తిందని అనుకుంటున్నారు. కానీ ఫేస్ బుక్ దీన్ని ఖండిస్తూ ఓ పోస్ట్ చేసింది. ‘ మేము ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం’ అని తెలిపింది. ఫేస్‌బుక్‌పై సైబర్ నేరగాళ్లు ఏమైన దాడి చేసుంటారా?  మరీ ఈ సమస్య ఎందుకు ఎదురైందనే విషయాలను ఫేస్‌బుక్ ఇంకా తెలియజేయలేదు.