టిక్‌టాక్‌‌కు పోటీగా ఫేస్‌బుక్‌ నుంచి కొత్త యాప్ - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌‌కు పోటీగా ఫేస్‌బుక్‌ నుంచి కొత్త యాప్

May 28, 2020

rty

సోషల్ మీడియాలో టిక్ టాక్ యాప్ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికి ఈ యాప్ గురించి తెలుసనడంలో అతియోశక్తి లేదు. మార్కెట్ లోకి వచ్చి తక్కువ సమయం అవుతున్న టిక్ టాక్ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కు పోటీగా యాప్ లను తీసుకుని రావాలని ఫేస్ బుక్, యూట్యూబ్ లు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్ పేరుతో ఓ అప్లికేషన్ ను తీసుకుని రావాలని ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఫేస్ బుక్ ఓ అడుగు ముందుకేసి టిక్ టాక్ కు పోటీగా కొల్లబ్ అనే యాప్ ను తీసుకుని వచ్చింది.

కొల్లాబ్ యాప్ ను ఇప్పటికే ఫేస్‌బుక్‌ రిసెర్చ్‌ అండ్ రిఫరెన్స్‌ గ్రూప్‌, ఎన్‌పీఈ బృందం రెండు రోజుల క్రితం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ యాప్‌ బీటా వెర్షన్ ప్రస్తుతం ఐఓఎస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. టిక్‌టాక్ మాదిరిగానే, ఈయాప్‌ ద్వారా ఇందులో పోస్ట్‌ చేసే వీడియోలను ఎవరైనా యూజర్లు తీసుకొని వాటితో తమకిష్టమైన రీతిలో మరో వీడియో తయారుచేసి కొల్లాబ్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చని ఫేస్‌బుక్‌ సంస్థ వివరించింది. ప్రస్తుతం అమెరికా, కెనడాలోనే అందుబాటులో ఉండగా త్వరలో ప్రపంచమంతా అందుబాటులోకి రానుంది.