ఫేస్‌బుక్ ఫోటోలు ఇక గూగుల్‌లో దాచుకోవచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ ఫోటోలు ఇక గూగుల్‌లో దాచుకోవచ్చు

December 3, 2019

సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులకు మరింత దగ్గర అవుతోంది. ఎఫ్‌బీలో సమస్య ఉందని ఎవరూ అనకుండా అప్‌డేట్ అవుతూ వస్తోంది. యూజర్లకు మరింత దగ్గరయ్యేందుకు త్వరలో ఎఫ్‌బీ ఓ నూతన టూల్‌ను అందుబాటులోకి తేనుంది. దీని సాయంతో యూజర్లు తమ ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఫోటోలను చాలా సులభంగా తమ గూగుల్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 

FB.

ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఐర్లాండ్‌లో పలు ఎంపిక చేసిన యూజర్లకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను ఇప్పటికే అందిస్తోంది. త్వరలో ప్రపంచంలో ఉన్న అందరు ఫేస్‌బుక్ యూజర్లకూ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. కాగా ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను తన డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేస్తున్నట్లు పేర్కొంది.