Home > Featured > ఫేస్‌బుక్‌లో మీ ప్రొఫైల్ సేఫ్టీకి కొత్త ఫీచర్.. ఇలా లాక్ చేయండి.. 

ఫేస్‌బుక్‌లో మీ ప్రొఫైల్ సేఫ్టీకి కొత్త ఫీచర్.. ఇలా లాక్ చేయండి.. 

Facebook Launches ‘Lock Profile’ Feature in India for Better Privacy

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ లిస్టులో లేనివారు కూడా ఇతరుల ప్రొఫైల్ చూడొచ్చనే విషయం తెలిసిందే. ఒకవేళ బ్లాక్ చేసుకుంటేనే తప్ప చూడలేం. అయితే ఇకపై ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారు మాత్రమే ప్రొఫైల్ చూసేలా ఓ సరికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్‌ యూజర్ల ప్రొఫైల్‌ భద్రతకు సంబంధించి ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవడానికి ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొద్దిపాటి మార్పులు చేస్తే సరిపోతుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. రాబోయే రెండు వారాల్లో ఈ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఈ విషయమై ఫేస్‌బుక్ స్సందిస్తూ.. ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మీ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు మీ గురించి తెలుకునేందుకు అవకాశం ఉండదు. దీంతో మీ వ్యక్తిగత వివరాలకు మరింత భద్రత లభిస్తుంది. అంతేకాకుండా మీ ప్రొఫైల్‌, కవర్‌ ఫొటోలు డౌన్‌లోడ్ చేయడం, వాటిని షేర్‌ చేయడం, మీ ఖాతాలో ఉన్న ఫొటోలను చూడడం, మీ టైమ్‌లైన్‌లో పోస్టింగ్‌లు చేయడం వంటివి చేయలేరు. ఒక్కసారి మీ ప్రొఫైల్‌ లాక్‌ అయితే, ప్రొఫైల్ లాక్డ్ అనే ట్యాగ్ కనిపిస్తుంది. మహిళలు ఆన్‌లైన్‌లో తమ వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల దీన్ని మరింత మెరుగుపరుస్తాంఅని వెల్లడించింది. ఫేస్‌బుక్‌‌లో మీ ప్రొఫైల్‌లో పేరు కింద మోర్‌ అనే ఆప్షపై క్లిక్‌ చేస్తే 'లాక్‌ ప్రొఫైల్‌' అనే ఆప్షన్ వస్తుంది. దానిని సెలెక్ట్‌ చేసి.. కన్ఫర్మ్‌ చేసి మరోసారి క్లిక్‌ చేస్తే మీ ప్రొఫైల్‌ లాక్‌ అవుతుంది. ఒక వేళ మీరు తిరిగి మీ ప్రొఫైల్‌ను అన్‌లాక్‌ చేయాలంటే 'యువర్‌ ప్రొఫైల్ ఈజ్‌ లాక్డ్' పై క్లిక్‌ చేసి అన్‌లాక్‌ అనే ఆప్షన్ సెలెక్ట్‌ చేస్తే అన్‌‌లాక్ అయిపోతుంది.

Updated : 21 May 2020 8:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top