ఫేస్‌బుక్‌లో 300 కోట్ల నకిలీ ఖాతాలు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌లో 300 కోట్ల నకిలీ ఖాతాలు బంద్

May 25, 2019

కొన్ని విషయాల్లో సోషల్ మీడియాను నమ్ముకోవడం కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదడం వంటిందే. విశ్వసనీయత లేని సమాచారం అక్కడ కుప్పలు తెప్పలుగా ఉంటుంది. ఇక నకిలీ ఐడీల సంగతి చెప్పాల్సిన పనేలేదు. అబ్బాయిలు అమ్మాయి పేర్లతో ఖాతాలు నడుపుతుంటారు. కేటుగాళ్లు ఉంటారు. నానా దగాజాతులూ తిష్టవేసి ఉంటాయి. అలాంటి నకిలీ ఐడీల పని పడుతోంది ఫేస్‌బుక్.

నకిలీ పోస్టులు అరికట్టేందుకు ఏకంగా 300 కోట్లకుపై ఫేక్ ఐడీలను తొలగించామని ఆ కంపెనీ చెప్పింది. 2018 అక్టోబరు నుంచి 2019 మార్చి మధ్య వీటిని తీసేశామని వెల్లడించింది. ‘2018 అక్టోబరు-డిసెంబరు మధ్య 120 కోట్లు, 2019 జనవరి-మార్చి మధ్య 219కోట్ల నకిలీ ఖాతాలను తీసేశాం. వీటి ద్వారా వార్తలను ప్రచారం చేయడంతోపాటు  అభ్యంతరకర కంటెంట్‌ ఉందని గుర్తించాం. కొందరు మా నిబంధనల ఉల్లంఘించారు. మాకు అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం..’ అని వివరించింది. నకీల ఐడీల తొలగింపు తర్వాత ఫేస్‌బుక్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 240 కోట్లుగా నమోదైంది.