ఫేస్‌బుక్‌ను మించిపోయిన టెన్సెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌ను మించిపోయిన టెన్సెంట్

November 21, 2017

సోషల్ మీడియా అనగానే అందరికీ చప్పున గుర్తుకొచ్చేది ఫేస్ బుక్. అమెరికాకు చెందిన ఎఫ్బీకి అడ్డుకట్టవేయడానికి చైనాలో టెన్సెంట్ అనే సోషల్ మీడియాను తీసుకొచ్చారు. సోషల్ మీడియాతోపాటు  వీడియో గేమ్, ఇతర మార్గాల్లోనూ ఇది కోట్లాది చైనీయులను ఆకట్టుకుంటోంది.తాజా టెన్సెంట్.. ఫేస్‌బుక్‌ రికార్డును బద్దలు కొట్టింది. మంగళవారం ఇన్వెస్టర్ల కోనుగోళ్లతో టక్సెంట్  ప్రపంచ దిగ్గజ  సంస్థల  టాప్‌ 5 జాబితాలో స్థానం దక్కించుకుంది మంగళవారం మధ్యాహ్నానానికి  టెన్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.15 ట్రిలియన్  హాంకాంగ్ డాలర్లు( 531 బిలియన్ డాలర్లు) రికార్డయింది. ఫేస్‌బుక్‌   మార్కెట్‌ క్యాప్‌ 519 బిలియన్ డాలర్లే. కాగా అయితే  మరో దిగ్గజ సంస్థ ఆపిల్‌  మార్కెట్‌ క్యాప్‌ 873 బిలియన్‌ డాలర్లు.