ఫేస్బుక్.. మానవ సంబంధాల విస్తరణకే కాదు ఘోరాలక కూడా కారణం అవుతోంది. ఫ్రెండ్షిప్ అంటూ మొదలయ్యే పరిచయాలు చెప్పరాని దారుణాలకు దారి తీస్తున్నాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఒక యువకుడు సికింద్రాబాద్ థియేటర్లో స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
జనగాం జిల్లా నెర్మెట్ట గ్రామానికి చెందిన భిక్షపతి(23) జేసీబీ డ్రైవర్. అతనికి రెండు నెలల కిందట సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతితో పరిచయం అయింది. ఆమె ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటోంది. భిక్షపతి, ఆమె ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునే వారు. భిక్షపతి జగద్గిరిగుట్టలోని తన చెల్లెలి ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ లోని తన ఫేస్ బుక్ స్నేహితురాలిని కూడా కలుసుకుంటూ ఉండేవాడు. ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. ఆమెకూడా అందుకు ఒప్పుకుంది. పెళ్లిచేసుకుందామని అనుకున్నారు.గత నెల 28న ఇద్దరూ నగరంలో చాలా చోట్ల తిరిగారు. మరుసటి రోజు ఇందిరాపార్కుకు వెళ్లి, అట్నుంచి సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్లో ఆడుతున్న ‘పద్మావతి’ సినిమా చూసేందుకు వెళ్లారు. థియేటర్లో కొద్దిమంది జనమే ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకున్న భిక్షపతి సినిమా చూస్తుండగానే ఆమెను ఓ మూలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. యువతికి రక్తస్రావమైంది. ఆమె భయపడిపోయి తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం భిక్షపతిని అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి యేటర్ యాజమాన్యంపై కేసు పెడతామని చెప్పారు.