ఫేస్‌బుక్‌ నుంచి డబ్బు సంపాదించే యాప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌ నుంచి డబ్బు సంపాదించే యాప్

November 28, 2019

ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ద్వారా యూజర్లు డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. డబ్బు సంపాదించేందుకు ఫేస్‌బుక్ వ్యూపాయింట్స్ అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ యాప్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర దేశాల కస్టమర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో సర్వేలు, టాస్క్‌లు, రీసెర్చ్‌లు ఉంటాయి. వీటిలో పాల్గొని యూజర్లు డబ్బు సంపాదించవచ్చు.

వీటి నుంచి ఫేస్‌బుక్ డేటాను కలెక్ట్ చేసి యాప్స్‌ను మరింత ఆకర్షణీయంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాగే కంపెనీ తన ఇతర ప్రొడక్టుల రూపకల్పనకు కూడా మీ అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటుంది. ‘కస్టమర్ ఇన్‌సైట్స్‌ను పరిగణలోకి తీసుకుని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి పలు ప్రొడక్టులను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తాం’ అని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ఎరిజ్ నవేహ్ తెలిపారు. ఫేస్‌బుక్ డబ్బును డైరెక్ట్‌గా యూజర్ పేపాల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. ఈ డబ్బులను తర్వాత తీసుకోవచ్చు. బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.