సోషల్ సైట్లు ఇలా మొరాయిస్తే..నెటిజన్లు ఏమైపోవాలో..! - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ సైట్లు ఇలా మొరాయిస్తే..నెటిజన్లు ఏమైపోవాలో..!

May 19, 2017

మొన్న వాట్సాప్..నిన్న ఫేస్ బుక్.. ఇవాళ ట్విట్టర్ లు మొరాయించాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రిదాకా వీటిని చూసే వినియోగదారుల్ని ఇబ్బందులు పెట్టాయి. గతనెలలో వాట్సాప్ ఓ రాత్రంతా పనిచేయలేదు. ఆ తర్వాత ఫేస్ బుక్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఇప్పుడు ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాదాపు 35 నిమిషాలపాటు ట్విటర్‌ మొరాయించింది. తమ ఖాతాలోకి లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించిన చాలామందికి ‘సాంకేతికంగా ఏదో పొరపాటు జరిగింది’ అన్న మెసేజ్‌ వచ్చింది.
జపాన్‌లో ట్విటర్‌ చాలా ఎక్కువగా మొరాయించిందని ‘డౌన్‌ డిటెక్టర్‌’ అనే సంస్థ తెలిపింది. ఆ తర్వాత అమెరికా.. యూకేలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య తలెత్తింది. భారత్‌లోని ఇతర నగరాలతో పోల్చితే బెంగళూరులో ట్విటర్‌ ఎక్కువగా ఇబ్బంది పెట్టిందట. అహ్మదాబాద్‌.. దిల్లీ.. .. లఖ్‌నవూ.. హైదరాబాద్‌.. చెన్నై నగరాల్లోనూ ఈ సమస్య ఎదురైంది. వెబ్‌సైట్‌తో పాటు.. మొబైల్‌ యాప్‌లలో ఈ సమస్య కనిపించింది.
ఇప్పటికే సైబర్‌ దాడులతో వణికిపోతున్న నెటిజన్లు.. ట్విటర్‌ మొరాయించడంతో ఇదీ వైరస్‌ ప్రభావమేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. 35 నిమిషాల్లోనే ట్విటర్‌ సేవలు తిరిగి మామూలు స్థితిలోకి వచ్చింది.